కొమురం భీం త్యాగాలను మరువం.. వర్థంతి వేళ కల్వకుంట్ల కవిత నివాళులు

by Kema Shiva Kumar |

గూడేలను ఒక్కటిగా చేసి నిజాం రాజు వెన్నులో వణుకు పుట్టించిన గోండు బెబ్బులి, ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీక కొమురం భీం వర్థంతి నేడు.

కొమురం భీం త్యాగాలను మరువం.. వర్థంతి వేళ కల్వకుంట్ల కవిత నివాళులు
X

దిశ, వెబ్‌డెస్క్: గూడేలను ఒక్కటిగా చేసి నిజాం రాజు వెన్నులో వణుకు పుట్టించిన గోండు బెబ్బులి, ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీక కొమురం భీం వర్థంతి నేడు. ఈ సందర్భంగా పలువురు రాజయాకీయ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కొమురం భీం వర్థంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. జల్, జంగల్, జమీన్ అనే గొప్ప సంకల్పంతో ఆదివాసీల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన వీరుడు కొమురం భీం అని కొనియాడారు. ఆయన నినాదం, పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం సాగిందని పేర్కొన్నారు. అంతటి మహానీయుడి త్యాగాలను మరువబోమని, ఆయన వర్థంతి సందర్భంగా మరోసారి స్మరించుకుందాం. కొమురం భీం వర్థంతి సందర్భంగా ఆయనకు వినమ్ర పూర్వక నివాళులు అంటూ కవిత ట్వీట్ చేశారు.

Next Story