- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుష్టు వ్యాధిపై తెలంగాణ విజయం.. గణాంకాలతో సహా క్లారిటీ ఇచ్చిన హెల్త్ డైరెక్టర్
రాష్ట్రంలో కుష్టు వ్యాధి కేసులు కొత్తగా పెరగడం లేదని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవిందర్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం కుష్టు వ్యాధి ఎలిమినేషన్ స్థాయిని సాధించిందని ఆయన పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కుష్టు వ్యాధి కేసులు కొత్తగా పెరగడం లేదని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవిందర్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం కుష్టు వ్యాధి ఎలిమినేషన్ స్థాయిని సాధించిందని ఆయన పేర్కొన్నారు. కుష్టు కేసుల గుర్తింపు కోసం రాష్ట్రంలో నిరంతరం స్క్రీనింగ్ కొనసాగుతున్నదని వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం ప్రతి 10 వేల జనాభాకు ఒక కేసు లేదా అంతకంటే తక్కువగా కేసులు నమోదు అవడాన్ని ఎలిమినేషన్ అంటారని, దీన్ని పబ్లిక్ హెల్త్ ముప్పుగా పరిగణించకూడదన్నారు. మన రాష్ట్ర జనాభా సుమారు 4 కోట్ల వరకు ఉండగా, రాష్ట్రంలో ఏటా సగటున 2600 కేసులు మాత్రమే నమోదు అవుతున్నాయని రవీందర్ నాయక్ తెలిపారు. 2022లో 2950, 2023లో 2607, 2024లో 2376, 2025లో 2592 కేసులు నమోదయ్యాయని అన్నారు. వ్యాధి నిర్దారణ అయిన ప్రతి పేషెంట్‌కు మల్టీ డ్రగ్ థెరపీ (ఎండీటీ) ప్రారంభించి పూర్తిస్థాయి చికిత్స ఉచితంగా అందిస్తున్నామన్నారు. కుష్టు వ్యాధిని తొందరగా గుర్తించి, చికిత్స అందిస్తే పూర్తిగా నయం అవుతుందని.. ఈ వ్యాధి గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.






