- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ రెండు మండలాల్లోకి చిరుతపులి ఎంట్రీ.. వణికిపోతున్న ప్రజలు
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం, న్యాల్ కల్ మండలాల్లోని పలు గ్రామాల్లో చిరుత సంచారం కలకలకం రేపుతోంది.

దిశ, ఝరాసంగం : సంగారెడ్డి జిల్లా ఝరాసంగం, న్యాల్ కల్ మండలాల్లోని పలు గ్రామాల్లో చిరుత సంచారం కలకలకం రేపుతోంది. సోమవారం రాత్రి ఝరాసంగం ఎల్గోయి గ్రామ శివారులో చిరుత సంచారాన్ని గ్రామానికి చెందిన రైతులు గమనించి పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు, రాత్రి ఎల్గోయి గ్రామ శివారు నుండి వివిధ గ్రామాల మీదుగా చిరుత న్యాల్ కల్ మండలంలోని ముంగి గ్రామంలోని ఓ పశువుల కొట్టం వరకు వెళ్లిందని గ్రామస్తులు తెలిపారు.
మంగళవారం ఉదయం జహీరాబాద్ అటవీశాఖ అధికారిని రాధికా రెడ్డి ఆధ్వర్యంలో చిరుత సంచారించిన ప్రాంతాన్ని పరిశీలించారు. చిరుత అడుగులను, గ్రామస్తులు తీసిన వీడియోను పరిశీలించిన వారు చిరుత సంచారం నిజమేనని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చిరించారు. అయితే ఎవరు కూడా అధైర్యపడొద్దని, రాత్రి వేళల్లో ఒంటరిగా బయటికి వెళ్లొద్దని అటవీ శాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా పశువులు ఉన్నవాళ్లు జాగ్రత్త వహించాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఎవరికైనా చిరుత కనిపిస్తే వెంటనే 99665 30594,99497 63307 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.






