- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొమురంభీం జిల్లాలో నడిరోడ్డుపై చిరుత పరుగులు.. షాకింగ్ వీడియో వైరల్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో పులుల సంచారం రోజు రోజుకు పెరిగిపోతుంది. మొన్నం కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్ దగ్గరలో నడి రోడ్డుపై పెద్దపులి దర్శనం ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో పులుల సంచారం రోజు రోజుకు పెరిగిపోతుంది. మొన్నం కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్ దగ్గరలో నడి రోడ్డుపై పెద్దపులి దర్శనం ఇచ్చింది. రోడ్డుకు అడ్డంగా పులి పడుకోవడంతో వాహనదారులు వణికిపోయారు. కాగా తాజాగా బుధవారం రాత్రి కొమురంభీం జిల్లా సిర్పూర్ టి మండలం వేంపల్లి రైల్వే బ్రిడ్జిపై చిరుతపులి పరుగులు పెట్టింది. వాహనదారులు రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలోనే చిరుత రోడ్డుపై కనిపించింది.
దీంతో వాహనదారుడు తన ఫోన్ లో వీడియో తీయగా చిరుత బ్రిడ్జిపై నుండి పారిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు మంచిర్యాల జిల్లాలోనూ పులుల సంచారం పెరుగుతోంది. ఇటీవల బెల్లంపల్లిలోని కన్నాల పరిధిలోనూ పెద్దపులి సంచారం కలకలం రేపింది. జిల్లాలో పులుల సంచారం పెరగటంతో రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. VIDEO






