- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యవసాయ రంగానికి మంచి డిమాండ్ ఉంది : శాసన మండలి చైర్మన్ గుత్తా ఆసక్తికర వ్యాఖ్యలు
వ్యవసాయ రంగానికి మంచి డిమాండ్ ఉందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : వ్యవసాయం అనే పేరులోనే సాయం ఉందని, రైతు నలుగురికి అన్నం పెట్టాలనే తపనతో వ్యవసాయం చేస్తారని లాభం కోసం కాదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ స్టేడియంలో రైతు బడి అగ్రిషో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభోత్సవం చేశారు. అనంతరం మాట్లాడుతూ, తాను బ్రతకడటంతో పాటు తనతో చుట్టూ ఉన్న వాళ్ళు బ్రతకాలి అనే మంచి మనసు రైతన్నకే ఉంటుందన్నారు. వ్యవసాయం చేస్తే నష్టాలు వస్తాయి అనేది తప్పు మాట అని సరైన పద్ధతిలో చేస్తే లాభాలు వస్తాయన్నారు.
వ్యవసాయ రంగానికి మంచి డిమాండ్..
వ్యవసాయ రంగానికి మంచి డిమాండ్ ఉందని, యువత ఆసక్తి చూపించాల్సిన అవసరం ఉందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతాంగానికి మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని వెల్లడించారు. రైతుబడి రాజేందర్ రెడ్డి ఎంతో కాలంగా తనకు ఆత్మీయులు.. ఆయన రైతుల కోసం నిరంతరం యూట్యూబ్ ఛానల్ ద్వారా కొత్త విషయాలను ప్రచారం చేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, ఆదర్శ రైతులు తుమ్మల యుగేందర్, పాశం రామ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






