స్థానిక సంస్థల ఎన్నికల్లో 'ముగ్గురు పిల్లల' నిబంధనపై రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం

by Prasad Jukanti |

స్థానిక ఎన్నికల్లో గరిష్ట సంతానం నిబంధనను ఎత్తివేసే విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

స్థానిక సంస్థల  ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధనపై రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: లొకల్ బాడీ ఎన్నికల్లో (local body elections) పోటీ చేసేందుకు ‘ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉన్న వారు అనర్హులు’ అనే నిబంధనను ఎత్తివేసేందుకు ఇటీవల తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ గరిష్ట సంతానం నిబంధనను ఎత్తివేస్తూ ఆర్డినెన్స్ (ordinance) జారీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్డినెన్స్ ద్వారా పంచాయతీరాజ్, మున్సిపాల్టీల చట్ట సవరణ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ముసాయిదా ఆర్డినెన్స్ గవర్నర్ కు పంపించబోతోంది. ఈ ఆర్డినెన్స్ ఆమోదం పొందితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న అనేక మంది ఆశావహులకు ఊరటగా మారనుంది. కాగా బీసీ రిజర్వేషన్ల కారణంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. రిజర్వేషన్లకు సంబంధించిన జీవో ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. వచ్చే నెలలో ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణకు రాబోతోంది. ఆలోపే ఈ నిబంధననకు ఆర్డినెన్స్ రూపంలో సవరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story