- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు చక్ రస్సెల్ కన్నుమూత
ప్రముఖ దర్శకుడు చక్ రస్సెల్ (74) కాలిఫోర్నియాలోని తన స్వగృహంలో కన్నుమూశారు.

దిశ, వెబ్‌డెస్క్: హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనదైన శైలి హారర్, కామెడీ, యాక్షన్ చిత్రాలతో ప్రత్యేక ముద్ర వేసిన ప్రముఖ దిగ్గజ దర్శకుడు చక్ రస్సెల్ (Chuck Russell) కన్నుమూశారు. కాలిఫోర్నియాలోని తన స్వగృహంలో ఆయన విగతజీవిగా కనిపించినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఆయన మరణానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎన్నో ఐకానిక్ చిత్రాలను ఆయన సినీ ప్రేక్షకులకు అందించారు.
ఆయన దర్శకత్వంలో వచ్చిన 'ది మాస్క్ (The Mask)' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించగా, 'ది స్కార్పియన్ కింగ్ (The Scorpion King)', 'ఎ నైట్‌మేర్ ఆన్ ఎల్మ్ స్ట్రీట్ 3', 'ది బ్లాబ్' వంటి సినిమాలు హారర్, యాక్షన్ జానర్లలో క్లాసిక్‌లుగా నిలిచాయి. కేవలం హాలీవుడ్‌కే పరిమితం కాకుండా, భారతీయ చిత్రసీమలోకి కూడా అడుగుపెట్టిన ఆయన విద్యుత్ జమ్వాల్ కథానాయకుడిగా 2019లో వచ్చిన 'జంగ్లీ' అనే బాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. చక్ రస్సెల్ ఆకస్మిక మృతి పట్ల హాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.






