- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలీవుడ్‌లోనే ఆ స్వేచ్ఛ ఉంది.. సౌత్ సినిమాలపై తమన్నా భాటియా సంచలన కామెంట్స్..
అయితే, తాను మొదటగా సౌత్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇక్కడి వాతావరణం పూర్తిగా వేరుగా అనిపించిందని తెలిపారు.

దిశ, సినిమా: తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఫేమ్ రాబట్టుకున్న తమన్నా భాటియా స్పెషల్ సాంగ్స్‌తోనూ కుర్రకారును ఊపేస్తున్నారు. కథాబలం ఉన్న పాత్రలను, కమర్షియల్ ప్రాజెక్ట్‌లను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఆమె, ప్రస్తుతం 'వివాన్' అనే హారర్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్, దక్షిణాది చిత్ర పరిశ్రమల మధ్య ఉన్న తేడా గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.బాలీవుడ్‌లో నటీనటులకు తమకు నచ్చిన పాత్రలను ఎంచుకునే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని తమన్నా అన్నారు. అక్కడ కేవలం అందంగా కనిపించడం, డ్యాన్స్ చేయడం మాత్రమే కాకుండా.. నటనకు ప్రాధాన్యం ఉన్న విభిన్నమైన పాత్రలు చేసే అవకాశం దక్కుతుందని చెప్పారు.
అయితే, తాను మొదటగా సౌత్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇక్కడి వాతావరణం పూర్తిగా వేరుగా అనిపించిందని తెలిపారు. దీనిని కొందరు పురుషాధిక్యత అనుకున్నప్పటికీ, తన దృష్టిలో ఇది పక్కా బిజినెస్ మోడల్ మాత్రమే అని చెప్పారు. సౌత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడానికి స్టార్ హీరోల ఇమేజ్, కమర్షియల్ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని వివరించారు. తానన్న మాటలను ఎవరూ విమర్శగా తీసుకోకూడదని, ఇవి కేవలం తన సొంత అనుభవాలు మాత్రమే అని స్పష్టం చేశారు. అలాగే, చిత్ర పరిశ్రమలో 10 నుండి 15 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం కెరీర్ కొనసాగించాలంటే.. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూనే, మరోవైపు గ్లామర్ పాత్రలను కూడా సమానంగా బ్యాలెన్స్ చేయక తప్పదని తమన్నా పేర్కొన్నారు.






