- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోట మైసమ్మ జాతర దుకాణాల వేలం.. గత సంవత్సరం కంటే 1,87,000 అధికం
కోట మైసమ్మ జాతర దుకాణాల వేలంలో రెండు మినహా మూడు వేలం పాటలు పూర్తయ్యాయి.

దిశ, కారేపల్లి: మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి గ్రామంలోని కోట మైసమ్మ దేవాలయం దసరా జాతర దుకాణాల బహిరంగ వేలం శుక్రవారం దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ సమత ఆధ్వర్యంలో, ఈవో కె. వెంకటయ్య పర్యవేక్షణలో జరిగింది. ఐదు లైసెన్స్‌లలో మూడు మాత్రమే పూర్తి కాగా, రెండు వాయిదా పడ్డాయి. కొబ్బరికాయలు–పూజా సామగ్రి విక్రయ హక్కు రూ.5.01 లక్షలకు దూదిమెట్ల వెంకటేశ్వర్లు దక్కించుకోగా, కొబ్బరి చిప్పల లైసెన్స్ రూ.1.83 లక్షలకు త్రిమూర్తులు, ఐస్‌క్రీమ్ విక్రయ హక్కు రూ.43 వేలుకు భాస్కరని లక్ష్మి పొందారు. ఈ మూడు వేలాల ద్వారానే గత ఏడాదితో పోలిస్తే దేవాలయానికి రూ.2.19 లక్షల అదనపు ఆదాయం సమకూరింది. లడ్డు–పులిహార, పుట్నాలు–పేలాలు, మిఠాయి విక్రయ లైసెన్స్‌లకు సంబంధించిన వేలం త్వరలో మళ్లీ నిర్వహిస్తామని ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వరలక్ష్మి రాజు, దేవాదాయ శాఖ సిబ్బంది లలిత, సాయి, మోహన్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






