- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యాయవాద వృత్తి సవాళ్లతో కూడుకుంది: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్
న్యాయవాద వృత్తి అనేక సవాళ్లతో కూడుకున్నదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: న్యాయవాద వృత్తి అనేక సవాళ్లతో కూడుకున్నదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. నల్సార్ యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయన కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ, ‘‘న్యాయవాదులు ఎప్పటికప్పుడు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కోర్టుల తీర్పులపై పూర్తి అవగాహన కలిగి ఉండటం అవసరం. నేటి తరంలో న్యాయవిద్యను అభ్యసించేవారి సంఖ్య పెరుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ప్రైవసీ వంటి కొత్త సాంకేతిక అంశాలు అనేక అవకాశాలు, సవాళ్లను తెస్తున్నాయి. సరైన మార్గదర్శకత్వం ద్వారా మాత్రమే నైపుణ్యం పెంపొందుతుంది. మెంటార్‌షిప్‌ను ఒక బాధ్యతగా తీసుకోవాలి. వృత్తిని, పని పట్ల ప్రేమ ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే విజయం సాధించగలుగుతాం’’ అన్నారు. ఇప్పటి న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్లలో ఒకటి, కొన్ని కేసుల విచారణ చాలా సంవత్సరాల పాటు కొనసాగడం క్షోభ కలిగించేదిగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.






