- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Uttam Kumar Reddy: కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు
కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం కమిషన్ (Kaleswaram Commission) ఇచ్చిన నోటీసులపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు హాస్యాస్పదంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) విమర్శించారు. ఆ పార్టీ తీరు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లుగా ఉందని ధ్వజమెత్తారు. ఇవాళ ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ కాళేశ్వరంలో అవినీతికి పాల్పడిందని వారి ప్రభుత్వం సమర్థత, అవినీతి వల్ల ప్రాజెక్టు కుప్పకూలిందన్నారు. కాళేశ్వరం అక్రమాలపై మా ప్రభుత్వం న్యాయ కమిషన్ ఆదేశించామని ఇందులో ప్రమేయం ఉన్నవారికి కమిషన్ నోటీసులు ఇస్తోందన్నారు. నోటీసులు అందిన వెంటనే ఉలిక్కిపాటుకు గురై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారన్నారు. బీఆర్ఎస్ నేతల వద్ద ఏదైనా సమాచారం ఉంటే వెళ్లి కాళేశ్వరం కమిషన్ కు చెప్పాలని కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులపై చట్టపరమైన చర్యలసు తీసుకుంటామన్నారు.






