- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాక హనుమంతు అంతిమయాత్రకు భారీగా తరలివచ్చిన వామపక్ష శ్రేణులు
పాక హనుమంతు అంతిమయాత్రకు భారీగా తరలివచ్చిన వామపక్ష శ్రేణులు

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామంలో మావోయిస్టు పార్టీ(Maoist Party) అగ్రనేత పాక హనుమంతు(Paka Hanumanthu) అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. ఈ అంతిమయాత్రకు సీపీఐఎం, సీపీఐ, సీపీఐఎంఎల్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ అంతిమయాత్ర సాగుతోంది. ఈనెల 25వ తేదీన ఒడిశాలో జరిగిన ఎదురుకాల్పుల్లో పాక హనుమంతు మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, 1961లో పుల్లెంల గ్రామంలో హనుమంతు జన్మించారు. ఆయనకు ముగ్గురు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో పుల్లెంలలో ఆయన పుట్టిన ఇల్లు పడావు పడింది. ఆయన ఒక సోదరుడు నల్లగొండలో నివాసం ఉంటుండగా సోదరీమణులు హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. నల్లగొండలోని ఎన్జీ కాలేజీలో హనుమంతు డిగ్రీ చదివారు. డిగ్రీ సెకండ్ ఇయర్‌లోనే మావోయిస్టు ఉద్యమంలో చేరారు. మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లా, రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు. నాలుగున్నర దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా ఉన్నారు. ఆయన మృతి మావోయిస్టు ఉద్యమానికి భారీ దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.






