ట్రంప్ పేరును ఉపసంహరించండి: లెఫ్ట్ పార్టీల పిలుపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-20 15:31:07  IST  )

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ వద్ద ఒక ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ పేరుతో ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా పెట్టాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపట్ల లెప్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లెఫ్ట్ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి..

ట్రంప్ పేరును ఉపసంహరించండి: లెఫ్ట్ పార్టీల పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ వద్ద ఒక ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ పేరుతో ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా పెట్టాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపట్ల లెప్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లెఫ్ట్ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాల సంపదను కొల్లగొట్టడానికి నేడు అమెరికా ప్రజల మీద యుద్ధాలను రుద్దుతున్నదని వామపక్షపార్టీల నేతలు మండిపడుతున్నారు. ప్రపంచ ప్రజల రక్త మాంసాలను పీల్చి పిప్పి చేస్తున్నదని అన్నారు. మనదేశం మీద ట్రంప్ ఆంక్షలు దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం నరేంద్రమోడీ సహకారం తోడవటంతో దేశం నష్టపోతున్నదని తెలిపారు. రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ 22వ తేదీన బషీర్‌బాగ్‌లోని బాబూజగ్జీవన్‌రాం విగ్రహం నుండి ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు జరిగే నిరసన ప్రదర్శనలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని లెఫ్ట్ పార్టీల నేతలు విజ్ఞప్తి చేశారు.

Next Story