CM Revanth Reddy : ప్రాజెక్టు ఎలా కట్టకూడదో కాళేశ్వరంను చూసి నేర్చుకోండి : సీఎం రేవంత్ రెడ్డి

by Muthe.Rajitha |

హైదరాబాద్‌(Hyderabad)లోని జలసౌధలో నీటిపారుదల శాఖ(Irrigation Dept)లో కొత్తగా నియమితులైన AE, JTOలకు నియామక పత్రాల(Appointment Letters ) పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు.

CM Revanth Reddy : ప్రాజెక్టు ఎలా కట్టకూడదో కాళేశ్వరంను చూసి నేర్చుకోండి : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌(Hyderabad)లోని జలసౌధలో నీటిపారుదల శాఖ(Irrigation Dept)లో కొత్తగా నియమితులైన AE, JTOలకు నియామక పత్రాల(Appointment Letters ) పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని శాఖలలో నీటిపారుదలశాఖ అతి ముఖ్యమైనది అని, ఎందుకంటే రైతు పండించే పంటలకు సకాలంలో నీళ్ళు అందించేందుకు 24 గంటలు శ్రమించే విభాగం ఇదేనని అన్నారు. దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం ఎన్నో గొప్ప సాగునీటి ప్రాజెక్టులు నిర్మించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది(Congress Govt) మాత్రమే అని కొనియాడారు.

ఎన్నో దశాబ్దాలుగా ఆ ప్రాజెక్టులు చెక్కు చెదర లేదని.. కానీ ఇప్పుడు కొంతమంది వారి కమీషన్ల కోసం నిర్మించిన ప్రాజెక్టులు కట్టిన మూడేళ్లకే కుప్పకూలయని పేర్కొన్నారు. ప్రపంచంలో వేరే ఏ ప్రాజెక్టు కూడా కట్టిన మూడేళ్లలోనే కూలిపోలేదని.. కాని అలాంటి ఘనత మాత్రం కేసీఆర్(KCR) కే దక్కుతుందని అన్నారు. ఇపుడు నియామక పత్రాలు అందుకున్న మీరు ఒక ప్రాజెక్టు ఎలా కట్టకూడదో కాళేశ్వరం(Kaleshwaram), సుందిళ్ళ(Sundilla), మేడిగడ్డ(Medigadda)ను చూసి నేర్చుకోవాలని తెలిపారు. లక్ష కోట్లు ఖర్చు పెడితే 50 వేల ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వని దుర్మార్గపు పాలన చేసింది గత ప్రభుత్వం అని మండిపడ్డారు.

గాడిద చేయాల్సిన పని గాడిద.. గుర్రం చేసే పని గుర్రమే చేయాలని అని తెలిపిన సీఎం.. ఎవరు చేసే పని వారే చేయాలని.. మీ ఇంజనీర్లు ప్రాజెక్టులు కట్టే పని చేయాలని.. రాజకీయ నాయకులు హెలికాప్టర్లలో మీది నుంచి చూస్తూ ఇంజనీరింగ్ లో వేలు పెడితే అలా ప్రాజెక్టులు కుప్పకూలి, లక్షల కోట్ల ప్రజాధనం సముద్రం పాలు అవుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో గులాబీ పార్టీ(BRS Party) కట్టిన ప్రాజెక్టులు ఎప్పుడు కూలిపోతాయోనని భయంగా ఉందన్నారు. నాయకుల మాటలు వింటే జైల్లో చిప్పకూడు తినాల్సింది మీరేనని.. ఆ విషయం గుర్తు పెట్టుకొని, ఎక్కడా అవినీతికి పాల్పడకుండా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాలని కొత్తగా నియమితులైన అభ్యర్థులకు సూచించారు.

Next Story