- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టిక్కెట్ కోసం నేతల తిప్పలు.. సామూహిక సీమంతాలు, అన్నప్రాసనలు!
అందరి దృష్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపైనే ఉంది.

దిశ, తెలంగాణ బ్యూరో: అందరి దృష్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపైనే ఉంది. అధికార కాంగ్రెస్ నుంచి బై పోల్ బరిలో ఎవరు ఉండొచ్చనే చర్చ ప్రధానంగా సాగుతున్నది. టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య కూడా పెద్దగానే ఉంది. ఈ క్రమంలో స్థానికులకే జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తామని ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించడంతో స్థానిక నేతలు అలర్ట్ అయ్యారు. టికెట్ ఆశావహులు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కటౌట్లు, హోర్డింగులు, పోస్టర్లతో హడావుడి చేస్తున్నారు. గతంలో ఇక్కడి నుంచి పోటీచేసిన నవీన్‌యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, రహమత్‌నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ మురళీగౌడ్, కంజర్ల విజయలక్ష్మి కాంగ్రెస్టికెట్ కోసం అధిష్టానం వద్ద ప్రయత్నాలను ప్రారంభించినట్లు చర్చ నడుస్తున్నది. వారితో పాటు మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి, ఖైరతాబాద్ఎమ్మెల్యే దానం నాగేందర్పేర్లు కూడా ప్రచారంలో ఉన్నా యి.
సీమంతాలు.. వైద్య పరీక్షలు
కాంగ్రెస్ టికెట్ఆశిస్తున్న నవీన్యాదవ్ఇటీవల నవయువ నిర్మాణ్, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఏఐసీసీ ఇన్ చార్జి విశ్వనాథ్ పెరుమాళ్ల, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మాజీ ఎంపీ అంజన్కుమార్యాదవ్ఏకేవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరం ఏర్పాటు చేయించి, కళ్ల జోళ్లను పంపిణీ చేస్తున్నారు. ‘రావాలి అంజన్న.. కావాలి అంజన్న’ అంటూ పోస్టర్లు వెలిశాయి. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రాంమోహన్, సీఎన్‌రెడ్డి, కంజర్ల విజయలక్ష్మి కూడా సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.






