ఓయూలో లేజర్ షోను అడ్డుకున్న విద్యార్ధి సంఘాల నేతలు

by Disha Web Desk 5 |
ఓయూలో లేజర్ షోను అడ్డుకున్న విద్యార్ధి సంఘాల నేతలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓయూలోని నిర్వహించే లేజర్ షోని అడ్డుకున్న విద్యార్ధి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతి శని, ఆది వారాలలో సాయంత్రం 6 గంటలకు డైనమిక్ లైటింగ్ అండ్ సౌండ్ సిస్టమ్ తో ఏర్పాటు చేసిన లేజర్ షో ద్వారా ప్రముఖుల చరిత్రను ప్రదర్శిస్తున్నారు. అయితే ఇవ్వాళ కొందరు విద్యార్ధి సంఘాల ఈ లేజర్ షోలో జార్జ్ రెడ్డి, గద్దర్ చరిత్రలను ప్రదర్శించడం లేదని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకొని లేజర్ షోకి అడ్డుపడుతున్న విద్యార్ధి సంఘాల నేతలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆ విద్యార్ధి నేతలు జోహార్ గద్దరన్న, జోహార్ జార్జి రెడ్డి అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. వీరిని ఓయూ పీఎస్ కు చెందిన పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్ కు తరలించారు.

Next Story