LB స్టేడియంలో కాంగ్రెస్ కృతజ్ఞత సభ

by Disha Web Desk 2 |
LB స్టేడియంలో కాంగ్రెస్ కృతజ్ఞత సభ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో డిసెంబరు 9వ తేదీన సోనియాగాంధీ జన్మదినం కావడంతో దానికి సింబాలిక్‌గా ఆ రోజున భారీ స్థాయిలో కృతజ్ఞతా సభను ఏర్పాటు చేసేలా పార్టీ స్టేట్ యూనిట్ ప్లాన్ చేస్తున్నది. తొలుత ఆ రోజునే ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించాలని రేవంత్‌ రెడ్డి భావించారు. కానీ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 7వ తేదీ జరిగే షెడ్యూలులో మార్పులు జరిగాయి. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు పలికి అధికారంలోకి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతగా ఈ నెల 9న ఎల్బీ స్టేడియంలో కృతజ్ఞతా సభను నిర్వహించేలా ప్రాథమిక షెడ్యూలు ఖరారైంది. ఢిల్లీ టూర్‌లో జరిగే చర్చల మేరకు దీనిపై రేవంత్‌రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయనున్నారు.



Next Story

Most Viewed