- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Raj Tarun-Lavanya: నన్ను వాళ్లు చంపేస్తారు.. నార్సింగి స్టేషన్ వద్ద లావణ్య హల్ చల్!

దిశ, డైనమిక్ బ్యూరో: టాలివుడ్ యువ నటుడు రాజ్‌తరుణ్ (Raj Tarun), అతడి స్నేహితుడు శేఖర్ భాషా (Shekhar Bhasha) తనని చంపేయానుకుంటున్నారని లావణ్య (Lavanya) తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం నార్సింగి పోలీస్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన లావణ్య మీడియాతో మాట్లాడారు. ‘మా కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. నిన్న మళ్లీ మా ఇంటికి నలుగురు మహిళలు వచ్చారు. రాజ్ తరుణ్, శేఖర్ బాషా నాపై దాడి చేయిస్తున్నారు. నేను ఒక్కో నిమిషం ప్రాణభయంతో బ్రతకాల్సి వస్తుంది. నిన్న స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. నా ప్రాణం పోయాక వారిని పట్టుకుంటారా? పోలీసులు కూడా నాకు న్యాయం చేయడం లేదు. వాళ్లు ఎవరో నన్ను చంపే బదులు నేనే పోలీస్ స్టేషన్ ఎదురుగా ప్రాణాలు వదిలేస్తా’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, టాలీవుడ్ యువ నటుడు రాజ్ తరుణ్, అతడి మాజీ ప్రేయసి లావణ్యల (Raj Tarun - Lavanya) వివాదం గత కొన్ని నెలలుగా నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా లావణ్య ఉంటున్న రాజ్ తరుణ్ ఇంటిని ఆమె వదిలి వెళ్లాలని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బుధవారం వాగ్వాదానికి దిగారు. అయితే ఈ విషయంలో రాజ్తరుణ్ తల్లిదండ్రులు తనమీద 15 మందితో కలిసి ఒకేసారి దాడికి దిగారని లావణ్య ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కంప్లయింట్ ఇవ్వడానికి హైదరాబాద్‌లోని నార్సింగి పోలీసులను ఆశ్రయించారు. రాజ్ తరుణ్ తను కలిసి కోకాపేటలో ఇల్లు కొన్నామని, ఇల్లు కొన్నప్పుడు తను రూ.70 లక్షలు రాజ్ తరుణ్‌కి ఇచ్చినట్లు లావణ్య మీడియా ముందు వాపోయారు. 11 ఏళ్లు రాజ్ తరుణ్ తనతో రిలేషన్‌లో (పెళ్లి కాకుండా కలిసి జీవించడం)లో ఉన్నాడని, అతడు తనతో ఉంటాడని జీవితం మొత్తం అతడికే సమర్పించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.






