- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్‌అండ్‌టీ నుంచి ‘సోలిడో’ వెల్డింగ్ ఎలక్ట్రోడ్ల ఆవిష్కరణ..
ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థ ఎల్‌అండ్‌టీ మార్కెట్లోకి ‘సోలిడో’ హై-పర్ఫార్మెన్స్ వెల్డింగ్ ఎలక్ట్రోడ్లను ఆవిష్కరించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్, టెక్నాలజీ సంస్థ ఎల్‌అండ్‌టీ పారిశ్రామిక రంగ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ‘సోలిడో’ హై-పర్ఫార్మెన్స్ వెల్డింగ్ ఎలక్ట్రోడ్ల శ్రేణిని ఆవిష్కరించింది. అత్యుత్తమ వెల్డింగ్ నాణ్యత, స్థిరమైన పనితీరు, మెరుగైన భద్రత, విశ్వసనీయతను అందించేలా ఈ ఉత్పత్తులను రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఫ్యాబ్రికేషన్, నిర్మాణం, మౌలిక సదుపాయాలు, తయారీ, హెవీ ఇంజినీరింగ్ రంగాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. ఈ ఉత్పత్తుల ఆవిష్కరణ కార్యక్రమం దీపప్రజ్వలనతో ప్రారంభమైంది. అనంతరం‘శుభారంభ్’ పేరుతో అధికారికంగా ఉత్పత్తులను విడుదల చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన బడిగ శ్రీకాంత్ ఈ ఉత్పత్తులను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు రంజన్ బీర్ సింగ్ ఆనంద్, పర్మేందర్ సింగ్, అలాగే బ్లూ3 గ్లోబల్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి రాకేష్ టి. పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎల్‌అండ్‌టీ కీలక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కూడా ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు బ్లూ3 గ్లోబల్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను అధికారిక ఛానల్ భాగస్వామిగా నియమించింది. ఈ భాగస్వామ్యంతో రెండు రాష్ట్రాల్లో ఉత్పత్తుల సులభ లభ్యత, వేగవంతమైన సాంకేతిక సేవలు, వినియోగదారులకు మెరుగైన మద్దతు అందించడంతో పాటు ప్రాంతీయ మార్కెట్లో మరింత బలోపేతం కావాలని ఎల్‌అండ్‌టీ లక్ష్యంగా పెట్టుకుంది. దక్షిణ భారత మార్కెట్లో ప్రపంచ స్థాయి వెల్డింగ్ పరిష్కారాలను మరింత విస్తరించేందుకు ఈ భాగస్వామ్యం కీలక అడుగు అని సంస్థ పేర్కొంది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక, మౌలిక సదుపాయాల రంగాలకు మరింత సురక్షితమైన, బలమైన, విశ్వసనీయమైన వెల్డింగ్ ఉత్పత్తులను అందించేందుకు రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించింది.
కొత్తగా విడుదలైన సోలిడో శ్రేణిలో సాధారణ ఫ్యాబ్రికేషన్ పనులకు అనువైన మైల్డ్ స్టీల్ ఎలక్ట్రోడ్లు (ఈ6013), అధిక బలం అవసరమైన నిర్మాణాల కోసం హైడ్రోజన్ ఎలక్ట్రోడ్లు (ఈ7018), తుప్పు నిరోధక, భిన్న లోహాల వెల్డింగ్ కోసం స్టెయిన్‌లెస్ స్టీల్ ఎలక్ట్రోడ్లు (ఈ308, ఈ308ఎల్, ఈ309, ఈ309ఎల్, ఈ316, ఈ316ఎల్) అందుబాటులోకి తీసుకొచ్చారు. వివిధ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పలు వ్యాసాల (డయామీటర్ల) లో ఈ ఉత్పత్తులను అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. అదనంగా, ఎల్‌అండ్‌టీ సుఫిన్ (L&T SuFin) ద్వారా వెల్డింగ్ కన్స్యూమబుల్స్, వెల్డింగ్ కేబుల్స్, ఎలక్ట్రోడ్ హోల్డర్లు, హ్యాండ్ షీల్డ్స్, వెల్డింగ్ గ్లవ్స్, వెల్డింగ్ యంత్రాలు, గ్యాస్ కట్టింగ్ పరికరాలు, గ్రైండింగ్ టూల్స్‌తో పాటు వివిధ వెల్డింగ్ అనుబంధ ఉత్పత్తులు కూడా ఒకే వేదికపై అందుబాటులో ఉంటాయని సంస్థ వెల్లడించింది.






