Chalapathi:మావోయిస్టు చలపతి అంత్యక్రియలు పూర్తి

by Prasad Jukanti |

మావోయిస్టు చలపతి అంత్యక్రియలు పూర్తయ్యాయి.

Chalapathi:మావోయిస్టు చలపతి అంత్యక్రియలు పూర్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి ప్రతాప్‌రెడ్డి అలియాస్ చలపతి(62) (Maoist Leader Chalapathi) అంత్యక్రియలు ముగిశాయి. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడులో బంధువులు, గ్రామస్తులు, సానుభూతిపరుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ నెల 19న ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లా కుల్హాడీఘాట్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో (Encounter) చలపతితో పాటు మొత్తం 18 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఇవాళ చలపతి మృతదేహాన్ని బొడ్డపాడుకు తీసుకువచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు.

Next Story