చివరి నిమిషంలో ట్విస్ట్.. సీఎం రేవంత్ రెడ్డి కేరళ పర్యటన రద్దు

by Kema Shiva Kumar |

ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొనడానికి కేరళ వెళ్లాల్సిన సీఎం రేవంత్ రెడ్డి చివరి నిమిషంలో తన టూర్‌ను రద్దు చేసుకున్నారు.

చివరి నిమిషంలో ట్విస్ట్.. సీఎం రేవంత్ రెడ్డి కేరళ పర్యటన రద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేరళ పర్యటన రద్దు అయింది. చివరి నిమిషంలో వాతావరణం అనుకూలించని కారణంగా టూర్‌ను రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే, సీఎం ఇవాళ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొనడానికి ప్రత్యేక విమానంలో కేరళకు బయలుదేరాల్సి ఉంది. ఈ మేరకు సెక్రటేరియట్‌లో జరగాల్సిన పెట్రోల్, ఎల్పీజీపై అధికారులతో సమీక్షా సమావేశాలను సైతం రద్దు చేసుకున్నారు. కానీ, వాతావరణం అనుకూలించని కారణంగా పైలట్ల సూచనతో చివరి నిమిషంలో రేవంత్ రెడ్డి తన కేరళ పర్యటనను వాయిదా వేసుకున్నట్లుగా సమాచారం.

Next Story