- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అడ్డంగా దొరికిపోయారు.. మేడ్చల్ జిల్లాలో భారీగా ఏపీఐ బల్క్ డ్రగ్స్ స్వాధీనం
రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి డ్రగ్ లైసెన్స్ లేకుండా మందులు, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ) నిల్వ ఉంచి విక్రయిస్తున్న ముఠాలపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు ఉక్కుపాదం మోపారు. వేర్వేరు ప్రాంతాల్లో జరిపిన మెరుపు దాడుల్లో రూ.34.55 లక్షల విలువైన నిల్వలను సీజ్ చేసినట్లు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ అవినాష్ మహంతి తెలిపారు. ..

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి డ్రగ్ లైసెన్స్ లేకుండా మందులు, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ) నిల్వ ఉంచి విక్రయిస్తున్న ముఠాలపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు ఉక్కుపాదం మోపారు. వేర్వేరు ప్రాంతాల్లో జరిపిన మెరుపు దాడుల్లో రూ.34.55 లక్షల విలువైన నిల్వలను సీజ్ చేసినట్లు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ అవినాష్ మహంతి తెలిపారు. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా, గౌడవెల్లి గ్రామంలోని కోక్రియేట్ గ్లోబల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (సింప్లిఫై) సంస్థపై డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు మెరుపు దాడి నిర్వహించారు. ఎలాంటి చెల్లుబాటు అయ్యే డ్రగ్ లైసెన్స్ లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన రూ.34 లక్షల విలువైన 32 హెచ్‌డీపీఈ డ్రమ్ముల బల్క్ డ్రగ్స్/ఏపీఐ నిల్వలను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్పేన్‌స్యూల్స్ ఫార్మా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన 13 డ్రమ్ముల ఇట్రాకొనజోల్ ఐపీ, ఆప్ట్రా సింథసిస్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన 19 డ్రమ్ముల క్లోపిడోగ్రెల్ బైసల్ఫేట్ ఐపీ బల్క్ డ్రగ్స్ ఉన్నాయి. సంస్థ జనరల్ మేనేజర్ వడ్లమూడి మోహన్ వంశీకృష్ణ ఆధీనంలో ఉన్న ఈ స్టాక్‌ను అధికారులు జప్తు చేశారు. డిప్యూటీ డైరెక్టర్ జి. శ్రీనివాస్ పర్యవేక్షణలో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బి. లక్ష్మీనారాయణ, డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు బి. మౌనిక, ఎం. హేమలత, డాక్టర్ ఆర్. గీతాంజలి ఈ దాడిలో పాల్గొన్నారు. మరో ఘటనలో నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం భీమారం గ్రామంలో ఎలాంటి లైసెన్స్ లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న ఒక మెడికల్ షాపుపై డ్రగ్స్ నియంత్రణ అధికారులు దాడి చేశారు. కే. నర్సయ్య అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ షాపును నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. అక్కడ విక్రయాల కోసం ఉంచిన యాంటీబయాటిక్స్, యాంటీ అల్సర్, పెయిన్ కిల్లర్స్ సహా సుమారు 31 రకాల మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.55,000 ఉంటుందని అధికారులు వెల్లడించారు.






