- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఉదారత
రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తన ఉదార స్వభావాన్ని మరోసారి చాటుకున్నారు. తన చిన్నాయన మల్లారెడ్డి ఇచ్చిన భూమిలో ఉన్న భవనం వ్యవసాయ శాఖకు ఇచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తన ఉదార స్వభావాన్ని మరోసారి చాటుకున్నారు. తన చిన్నాయన మల్లారెడ్డి ఇచ్చిన భూమిలో ఉన్న భవనం వ్యవసాయ శాఖకు ఇచ్చారు. యాచారం మండల కేంద్రంలోని 2 వేల గజాల భూమిని వ్యవసాయ శాఖ కు కేటాయిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును కలిసి భూమికి సంబందించిన పత్రాలను అందించారు. ఆ భూమి విలువ బహిరంగ మార్కెట్లో రూ. 4 కోట్లకు పైగానే ఉంది. నెలరోజుల కితం రైతు కమిషన్ ,వ్యవసాయ అధికారులు కలిసి యాచారం మండలంలో పర్యటించారు. ఆ సమయంలో కోదండరెడ్డి ప్రభుత్వానికి ఇవ్వాలనుకున్న భూమిని అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి తోపాటు మార్కెటింగ్ అధికారులకు చూపించారు.
ప్రస్తుతం ఆ స్థలంలో రైతు మిత్ర కమ్యూనిటీ భవనం ఉంది. అందులో రైతులు వ్యవసాయ సామాగ్రి, ధాన్యం కొనుగోలు కేంద్రం, సీజన్ పంటలు నిలువ కోసం వినియోగిస్తున్నారు. ఇక నుంచి ఆ స్థలంలో ఉన్న భవనాన్ని పూర్తిగా వ్యవసాయ శాఖకు ఇస్తే రైతులకు మరింత మేలు జరుగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోదండరెడ్డి తెలిపారు. శనివారం సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి ల కు ఈ విషయం చెప్పి స్థలానికి సంబంధించి దస్త్రాలను అందజేశారు. అదేవిదంగా యాచారం మండల కేంద్రంలో కూరగాయల మార్కెట్ ను ఏర్పాటుచేయాలని రైతు కమిషన్ కోరింది. దానికి సంబంధించి ప్రైవేట్ స్థలం యాచారం బస్టాండ్ కు అనుకొనే ఉన్నట్లు కమిషన్ బృందం మంత్రి కి వివరించారు.






