- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గద్దర్ ఫౌండేషన్ కు స్థలం, నిధులు కేటాయించాలి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
గద్దర్ ఫౌండేషన్(Gaddar Foundation)కు స్థలం, నిధులు కేటాయించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్(MLC Dasoju Shravan) డిమాండ్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : గద్దర్ ఫౌండేషన్(Gaddar Foundation)కు స్థలం, నిధులు కేటాయించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్(MLC Dasoju Shravan) డిమాండ్ చేశారు. గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆగస్ట్ 6వ తేదీన నిర్వహించనున్న ప్రజా గాయకుడు గద్దర్ రెండవ వర్ధంతి సభకు సంబంధించిన పోస్టర్‌ను ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. గద్దర్ పాట, ఆట, మాటలను వినియోగించుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, అనంతరం ఆయనకు తగిన గౌరవం ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
'ఓడలో ఉంటే ఓడ మల్లయ్య, ఓడ దిగిన తర్వాత బోడ మల్లయ్య' అన్నట్లు.. ఆయనను ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన గుర్తులు లేకుండా గద్దర్ అవార్డుల(Gaddar Awards) వేడుకను నిర్వహించడం, నిధులు, స్థల ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం ఆయనను అవమానించడమేనని, ఇది ప్రభుత్వ కృతజ్ఞతారాహిత్యానికి సజీవ సాక్ష్యం అని వ్యాఖ్యానించారు. గద్దర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గద్దర్ ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేపట్టాలని, ఆ ఆశయాలకు అనుగుణంగా కార్యాచరణ కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
గద్దర్ రెండవ వర్ధంతి నాటికి ఫౌండేషన్‌కు స్థలం కేటాయించడంతో పాటు, అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 'గద్దర్ జీవితం ఒక ఉద్యమానికి ప్రతీక. ఆయన కలలు, ఆశయాలు నిలదొక్కుకునేలా చేయడం ప్రభుత్వ బాధ్యత' అని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.






