మూగజీవాల మీద మీకున్న ప్రేమకు లాల్ సలాం.. కేటీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ చామల కౌంటర్

by Ramesh Goud |   (  Updated:2025-04-23 07:31:08  IST  )

డ్రామారావు అండ్ కో.. అందరూ ఆర్టిస్టులే! అని భువనగిరి(Bhuvanagirir) కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Congress MP Chamala Kiran Kumar Reddy) ఎద్దేవా చేశారు.

మూగజీవాల మీద మీకున్న ప్రేమకు లాల్ సలాం.. కేటీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ చామల కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: డ్రామారావు అండ్ కో.. అందరూ ఆర్టిస్టులే! అని భువనగిరి(Bhuvanagirir) కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Congress MP Chamala Kiran Kumar Reddy) ఎద్దేవా చేశారు. వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ (BRS Silver Jubilee Meeting)కు సూర్యాపేట రైతులు ఎడ్లబండ్లలో బయలుదేరారని మాజీమంత్రి జగదీష్ రెడ్డి (Jagadeesh Reddy) ట్వీట్ చేశారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) స్పందిస్తూ.. మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా తెలంగాణ ఇంటి పండుగకు బయలుదేరిన అన్నదాతల సంకల్పానికి నా సలాం అంటూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ట్వీట్ పై ఎంపీ చామల.. మూగజీవాల మీద మీకున్న ప్రేమకు లాల్ సలాం అని కౌంటర్ ఇచ్చారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ.. యొండకాలం.. యెడ్ల బండ్లు.. అది కూడా పక్కూరో, పాత సూర్యాపేటనో కాదు కదా అని అన్నారు. సూర్యాపేట నుంచి వరంగల్ కు 120 కిలోమీటర్ల దూరం.. అటు 5 ఇటు 5 రోజుల ప్రయాణం వద్దని చెప్పకుండా మీ దొర తనం చూపుతున్నారా కేటీఆర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక కంచె గచ్చిబౌలి (Kancha Gachibouli)లో లేని మూగ జీవాల మీద కపట ప్రేమను చూపించిన కేటీఆర్.. మూగ జీవాల మీద మీ ప్రేమ ఎక్కడ పోయిందని విమర్శించారు. దొరతనం చూపుకోవడానికీ మీరు రైతులతో బండి వెనుక బండి కట్టించారని, యెడ్లు మీకు మూగ జీవాలుగా కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. మీ సభ కోసం ఈ హైటెక్ యుగంలో మూగ జీవాలను హింసిస్తారా? అంటూ మీకు మూగ జీవాల మీదున్న ప్రేమకు లాల్ సలాం కేటీఆర్ అని ఎంపీ చామల వ్యంగ్యస్త్రాలు సంధించారు.

కాగా అంతకుముందు కేటీఆర్ ట్విట్టర్ లో.. మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా “బండెనక బండి కట్టి”, తెలంగాణ ఇంటి పార్టీ పండుగకు బయలుదేరిన అన్నదాతల సంకల్పానికి నా సలాం అన్నారు. అలాగే జగదీష్ రెడ్డి నాయకత్వంలో.. సూర్యాపేట రైతులు చూపించిన ఈ చైతన్యం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. స్వీయ రాజకీయ అస్థిత్వమే తెలంగాణకు శ్రీ రామ రక్ష అని మీ ఆశయం ఎలుగెత్తి చాటుతోందని చెప్పారు. గులాబీ జెండాను గుండెల నిండా నింపుకున్న మీరే బీఆర్ఎస్ కు కొండంత గుండె ధైర్యమని అన్నారు. కాంగ్రెస్ పాలనలో దగాపడ్డ లక్షలాది మంది రైతన్నలే.. రేపు రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పే రథసారథులు అని బీఆర్ఎస్ నేత రాసుకొచ్చారు.

Next Story