- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Delhi Bonalu: ఢిల్లీ తెలంగాణ భవన్లో లాల్ దర్వాజా బోనాలు.. మూడు రోజుల పాటు వేడుకలు
ఢిల్లీలో మూడు రోజుల పాటు (Lal Darwaja Bonalu) లాల్ దర్వాజా బోనాలు నిర్వహించనున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఢిల్లీలో మూడు రోజుల పాటు (Lal Darwaja Bonalu) లాల్ దర్వాజా బోనాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇవాళ ఢిల్లీలోని తెలంగాణ భవన్ (Telangana Bhavan) వర్గాలు, సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. సింహవాహిని మహంకాళి అమ్మవారి ఉత్సవాలు జూన్ 30 నుంచి జూలై 2వ తేదీ వరకు తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఢిల్లీలో ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జూన్ 30 వ తేదీన తెలంగాణ భవన్ లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జూలై 1 వ తేదీన (India Gate) ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు మహంకాళి అమ్మవారి ఊరేగింపు ఉంటుందని వెల్లడించారు.
జులై రెండో తేదీన పోతురాజు, కళాకారుల నృత్యాలు ఉంటాయన్నారు. గత పదేళ్ల నుంచి ఢిల్లీలో తెలంగాణ భవన్ లో సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీలో ఉన్న తెలుగు వారంతా పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానం తెలిపారు. లాల్ దర్వాజా బోనాలు ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో పలువురు ప్రముఖులు రాబోతున్నారని సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రకటన విడుదల చేశారు.






