- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లక్డికాపూల్ జంక్షన్ నుంచి వెళ్తున్నారా.. ఈ విషయం తెలుసుకోండి..!
లక్డికాపూల్ జంక్షన్ రోడ్డు పై వద్ద వర్షపు నీరు నిలవకుండా జీహెచ్ఎంసీ అధికారులు వరద నీటి కాలువ నిర్మాణం పనులను ప్రారంభించారు.

దిశ, సిటీక్రైం : లక్డికాపూల్ జంక్షన్ రోడ్డు పై వద్ద వర్షపు నీరు నిలవకుండా జీహెచ్ఎంసీ అధికారులు వరద నీటి కాలువ నిర్మాణం పనులను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో లక్డికాపూల్ జంక్షన్ వద్ద రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్ అంక్షలను విధించారు అధికారులు. ఉదయం పూట ట్రాఫిక్ రద్దీని ద్రుష్టిలో పెట్టుకుని ఈ నిర్మాణాన్ని రాత్రి సమయంలో చేపడుతున్నారు. దీంతో ట్రాఫిక్ అధికారులు రాత్రి సమయాల్లో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ మళ్ళింపులను చేపట్టారు.
ఈ నిర్మాణ పనులు లక్డికాపూల్ ఇంటలిజెన్స్ కార్యాలయం నుంచి ద్వారకా హోటల్, లక్కీ రెస్టారెంట్, వెంకటేశ్వర హోటల్ పాత సైఫాబాద్ పోలీసు స్టేషన్ జంక్షన్ వరకు జరుగనున్నాయి. ఈ పనులు నేటి నుంచి నెల రోజుల పాటు జరుగుతాయని పోలీసులు అధికారులు వివరించారు. రాత్రి సమయాల్లో ఈ మార్గంలో ప్రయాణీంచే వాహనదారులు ట్రాఫిక్ పోలీసులు సూచించిన మళ్ళింపులను పాటించి సురక్షితంగా ప్రయాణీంచాలని హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం జాయింట్ పోలీసు కమిషనర్ జోయెల్ డేవిస్ ప్రకటనలో తెలిపారు. టూరిస్టు బస్సులు కూడా రాత్రి 11 లోపే ఇక్కడ నుంచి రాకపోకలను ముగించుకోవాలని పోలీసులు తెలిపారు.
రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్ మళ్ళింపులు ఇలా..
*లక్డికాపూల్ సంత్ నిరంకారి భవనం వైపు నుంచి వచ్చే వాహనాలను రవీంద్రభారతి మీదుగా మళ్లిస్తారు.
*రవీంద్ర భారతి నుంచి పాత సైఫాబాద్ పోలీసు స్టేషన్ వైపు వచ్చే వాహనాలను ఇక్బాల్ మీనార్ నుంచి సెక్రటేరియట్ వైపు పంపిస్తారు.
*సెక్రటేరియట్ నుంచి పాత సైఫాబాద్ పోలీసు స్టేషన్ వైపు వచ్చే వాహనాలను రవీంద్రభారతి నుంచి డైవర్ట్ చేస్తారు.






