Lagacharla Case: లగచర్ల కేసులో బిగ్ ట్విస్ట్.. విచారణలో కళ్లు బైర్లుకమ్మే నిజాలు వెలుగులోకి

by Shiva |
Lagacharla Case: లగచర్ల కేసులో బిగ్ ట్విస్ట్.. విచారణలో కళ్లు బైర్లుకమ్మే నిజాలు వెలుగులోకి
X

దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లా (Vikarabad District) దుద్యాల (Dudyala) మండల పరిధిలోని లగచర్ల (Lagacharla)లో ఫార్మా సిటీ (Pharm City) కోసం అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్‌ (Collector), అధికారులపై గ్రామస్థుల దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు దాడికి పాల్పడిన 16 మందికిపైగా గ్రామస్తులపై పోలీసులు కేసులు నమోదు చేసి సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించారు. తాజాగా, కేసులో A1గా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narender Reddy), అనుచరుడు భోగమోని సురేష్ (Bhogamoni Suresh)ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని భూసేకరణను అడ్డుకోవడం, ఆర్థిక సాయంపై పోలీసులు ఎంక్వైరీని వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

దాడికి ముందు మూడు రోజుల పాటు గ్రామంలో లిక్కర్ పార్టీ (Liquor Party)లు జరిగినట్లుగా తెలుస్తోంది. కోస్గీ (Kosgi)‌లో లిక్కర్‌ బాటిళ్లను కొనుగోలు చేసి నరేందర్ రెడ్డి (Narender Reddy) అనుచరుడు సరేష్ (Suresh), లగచర్ల (Lagacharla)కు తరలించినట్లుగా సమాచారం. ఈ మేరకు కోస్గీ (Kosgi) ఎక్సైజ్ పోలీసుల నుంచి కూడా సమాచారం సేకరించారు. భూ సేకరణను అడ్డుకునేందుకు మూడు రోజుల ముందుగానే నిందితులు పక్కా స్కెచ్ వేసినట్లుగా విచారణలో వెల్లడైంది. బీఆర్ఎస్ (BRS) నేతలు, కార్యకర్తలతో నిందితులు పలుమార్లు రహస్య భేటీలు నిర్వహించి దాడికి ఉసిగొల్పినట్లుగా తెలుస్తోంది. నిందితుడు భోగమోని సురేష్ (Bhogamoni Suresh) కుట్రలో కీలకంగా వ్యవహరించిన పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narender Reddy)తో సహా మరో ఇద్దరు మాజీ మంత్రుల (Former Minsters) పేర్లను బయటపెట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో సురేష్‌ను అరెస్ట్ తరువాత అతడితో కాంటాక్ట్‌లో ఉన్న వారిని పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed