- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. చివరికి వ్యభిచారిగా మారి!
ఇన్‌స్టాగ్రామ్ ( Instagramme) పరిచయం ఓ యువతి కొంపముంచింది. ఏకంగా ఆ యువతిని వ్యభిచారిగా కూడా మార్చేసింది. థాయిలాండ

దిశ, వెబ్ డెస్క్: ఇన్‌స్టాగ్రామ్ ( Instagramme) పరిచయం ఓ యువతి కొంపముంచింది. ఏకంగా ఆ యువతిని వ్యభిచారిగా కూడా మార్చేసింది. థాయిలాండ్ కు ( Thailand) సంబంధించిన... ఓ లేడీని మోసం చేసి.. ఈ పరిస్థితికి తీసుకువచ్చాడు ఓ దుర్మార్గుడు. ఈ సంఘటన తాజాగా హైదరాబాదులో వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. థాయిలాండ్ కు చెందిన 30 ఏళ్ల యువతి సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఓ స్నేహితుని కోసం చెన్నై వచ్చేసింది.
చెన్నైకి వచ్చిన ఆ యువతిని ట్రాప్ చేసి హోటల్లో ఉంచాడు ఆ దుర్మార్గుడు. అనంతరం పలుమార్లు లైంగిక దాడి కూడా చేశాడు. ఆమెను మోసం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. డబ్బులు లేకపోవడంతో.. హోటల్ రెంట్ కట్టడం కోసం వ్యభిచారంలోకి దిగింది ఆ యువతి. మళ్లీ థాయిలాండ్ వెళ్లిపోవడానికి... భారీగా డబ్బులు కావాలి. అయితే ఆ డబ్బులు లేకపోవడంతో... థాయిలాండ్ నుంచి వ్యభిచారం కోసం అమ్మాయిలను పంపావు గ్యాంగ్ ను సంప్రదించింది ఆ యువతి. ఈ నేపథ్యంలోనే మరో యువతితో.. ఈ లేడీ ని కలిపి హైదరాబాదులోని శ్రీనగర్ లో ఉన్న ఓ ఫ్లాట్లో ఉంచారు. అక్కడే గత కొన్ని రోజులుగా వ్యభిచారం చేయిస్తోంది ముఠా.
అయితే.. స్థానికులు ఇచ్చిన సమాచారం నేపథ్యంలో ఆ ఫ్లాట్ పై రైడ్ జరిగింది. దీంతో ఆ ఇద్దరు యువతులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ తరుణంలోనే ఆ అమ్మాయిని విచారణ చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. సోషల్ మీడియా పరిచయం కారణంగా తనకు ఈ పరిస్థితి వచ్చిందని పోలీసులకు బాధిత యువత పేర్కొంది. దీంతో ఆమెను పునరావాస కేంద్రానికి తరలించారు పోలీసులు.
జూబ్లీహిల్ల్స్‌లో అందంగా బిల్డింగ్.. పెద్ద ఫ్లాట్.. అక్కడ జరిగేది చూసి షాకైన పోలీసులు






