- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంటిబిడ్డతో "బతుకమ్మ" విధులకు హాజరైన లేడీ కానిస్టేబుల్
by Naga Rani Yarlagadda |
మహిళలు.. మహరాణులు అని ఊరికే అనలేదు పెద్దలు. ఇంటిని చక్కబెట్టుకుంటూనే,

X
దిశ, వెబ్‌డెస్క్: మహిళలు.. మహరాణులు అని ఊరికే అనలేదు పెద్దలు. ఇంటిని చక్కబెట్టుకుంటూనే, భర్త, పిల్లల ఆలనా పాలనా చూసి.. తానూ ఉద్యోగానికి వెళ్లి.. మళ్లీ ఇంటి పని చేసుకోవాలి. ఇంత చేస్తున్నా ఆడవాళ్లు ఇంట్లో పనిచేసుకుంటూ హాయిగా ఉంటారన్న విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఆ విమర్శలను కొట్టిపారేసే దృశ్యం బతుకమ్మ వేడుకల్లో కనిపించింది. శనివారం సాయంత్రం కూకట్ పల్లిలోని హనుమాన్ ఆలయ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో విధులు నిర్వహించేందుకు మహిళా కానిస్టేబుల్ కీర్తన చంటిబిడ్డను తీసుకుని హాజరయ్యారు. ఉద్యోగం పట్ల ఆమెకు ఉన్న గౌరవం, బిడ్డ పట్ల ఉన్న ప్రేమ, కుటుంబ బాధ్యతలను చూసిన కొందరు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
Next Story






