- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కళ్లు చెదిరేలా లేడీ అఘోరీ సంపాదన.. ఒక్క రోజుకు ఎన్ని వేలు వస్తాయంటే?
అఘోరీని ప్రేమించి పెళ్లి చేసుకున్న వైష్ణవి సైతం అతడిని విడిచిపెట్టి కొత్త జీవితం ప్రారంభించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అఘోరీ గురించి షాకింగ్ నిజాలు బయట పెట్టింది.

దిశ, వెబ్ డెస్క్: లేడీ అఘోరీ గత కొంతకాలంగా ఈ పేరు పెద్దగా బయట వినిపించడంలేదు కానీ జైలుకు వెళ్లకముందు ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు హిమాలయాల నుండి వచ్చానని చెప్పుకున్న లేడీ అఘోరీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాడు. సనాతన ధర్మాన్ని కాపాడటం పక్కన పెట్టి ప్రశ్నించిన ప్రజలపై దాడులు చేయడం.. పోలీసులను బూతులు తిట్టడం ఇలా ఎన్నో చేశాడు. అక్కడితో ఆగకుండా వర్షిణి అనే అమ్మాయితో ప్రేమాయణం సైతం మొదలు పెట్టాడు. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే చివరికి ఆ ప్రేమ పెళ్లే అఘోరీ కొంపముంచింది.
వర్షిణి కంటే ముందు అఘోరీ తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కేసు తరవాత తమ వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని మరికొందరు బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి వరకు కారులో దర్జాగా తిరుగుతూ ఎంజాయ్ చేసిన అఘోరీ బతుకు బస్టాండ్ అయింది. నేరాలు రుజుకావడంతో అతడు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కొన్ని నెలల జైలు జీవితం తరవాత అఘోరీ ఇటీవలే విడుదలవ్వగా పోలీసుల దెబ్బకు మళ్లీ కనిపించకుండా పోయాడు.
అయితే గతంలో అఘోరీని ప్రేమించి పెళ్లి చేసుకున్న వర్షిణి సైతం అతడిని విడిచిపెట్టి కొత్త జీవితం ప్రారంభించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అఘోరీ గురించి షాకింగ్ నిజాలు బయట పెట్టింది. అఘోరీ కారులో కూర్చునే రోజుకు రూ.20 నుండి రూ.30వేలు సంపాదించేవాడని చెప్పింది. అతడు ఏ ఊరు వెళ్లినా చూసేందుకు వచ్చిన ప్రజలు రూ.500, రూ.1000 అతడి చేతిలో పెట్టేవాళ్లని చెప్పింది. ఆహారం కూడా ఇచ్చేవాళ్లని దానితో పాటు పెట్రోల్ కూడా ప్రజలే కొట్టించేవాళ్లని తెలిపింది. అలా రోజుకు అఘోరీ రూ.20 నుండి రూ.30వేల వరకు సంపాదించేవాడని చెప్పుకొచ్చింది. ప్రతిరోజు గుడులకు వెళ్లేవాళ్లమని రాత్రుళ్లు పెట్రోల్ బంక్ లో పడుకునేవాళ్లమని స్పష్టం చేసింది. ప్రస్తుతం వర్షిణి మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.






