- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలు ఈ నెంబర్ సేవ్ చేసుకోండి.. హైదరాబాద్ పోలీస్ ప్రత్యేక వాట్సప్ నంబర్..
నగరంలో మహిళల రక్షణ కోసం హైదరాబాద్ సిటీ పోలీస్ ప్రత్యేక వాట్సప్ నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: నగరంలో మహిళల రక్షణ కోసం హైదరాబాద్ సిటీ పోలీస్ ప్రత్యేక వాట్సప్ నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. బాధిత మహిళలు తమ కంప్లైంట్స్ ఇవ్వడానికి, ఆపద ఉన్న సమయంలో మహిళలు ఈ నెంబర్ యూస్ చేయాలని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఉమెన్ సేఫ్టీ హెల్ప్ లైన్ వాట్సాప్ నెంబర్ 9490616555 కచ్చితంగా సేవ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. వెంటనే ఈ నెంబర్‌ను సేవ్ చేసుకోవాలని, షీటీమ్స్, సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఉమెన్ సేఫ్టీ కోసం ప్రత్యేకంగా ఈ నెంబర్ తెచ్చారని అధికారులు పేర్కొన్నారు.
కాగా, నగరంలో ఇటీవల గణేష్ నిమజ్జనం సమయంలో ఆకతాయిలు రెచ్చిపోయారు. మహిళపై అసభ్యకరంగా తాకుతూ వికృత చేష్టలు చేశారు. ఇది గమనించిన షీ టీమ్స్ చాలా మందిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో షీ టీమ్స్ ఎంతో మంది ఆకతాయిల ఆట కట్టించారు.
Next Story






