Results: తెలంగాణలో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ - II ఫలితాలు విడుదల

by Ramesh Naini |   (  Updated:2025-11-17 10:49:42  IST  )

రాష్ట్రంలో మెడికల్ & హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి.

Results: తెలంగాణలో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ - II ఫలితాలు విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో మెడికల్ & హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ - II పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్ రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో ఫలితాలను హెల్త్ సెక్రటరీ డా క్రిస్టినా, మెడికల్ బోర్డు అధికారులతో కలిసి విడుదల చేశారు.

1260 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల లిస్ట్‌ను అధికారులు రిలీజ్ చేశారు. ఈ పోస్టులకు మొత్తం 24,045 మంది దరఖాస్తు చేసుకోగా, 23,323 మంది పరీక్షకు హాజరయ్యారు. ఫలితాలను అభ్యర్థులు https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ఎంపిక అయిన అభ్యర్థులు డిసెంబర్‌లో ప్రభుత్వ హాస్పిటల్స్‌లోకి భర్తీ కానున్నట్లు అధికారుల సమాచారం. మరోవైపు స్పోర్ట్స్ కోటా సెలక్షన్ జాబితాను సెపరేట్‌గా విడుదల చేస్తామని ఎంహెచ్ఎస్ఆర్బీ వెల్లడించింది. అలాగే వికలాంగుల కోటాలో దరఖాస్తులు రాకపోవడంతో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది.

Next Story