స్వయంగా బండి సంజయే వారిని పోలీసులను అప్పగించాలి: ఎల్.రమణ

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయని శాసన మండలి బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత ఎల్.రమణ ఆరోపించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

స్వయంగా బండి సంజయే వారిని పోలీసులను అప్పగించాలి: ఎల్.రమణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయని శాసన మండలి బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత ఎల్.రమణ ఆరోపించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్ మీద మాట్లాడిన విషయాలపై స్పందించారని.. దానికి బండి సంజయ్ గుండాలు కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద పట్ట పగలు దాడి చేశారని అన్నారు. ప్రభుత్వ ఆస్తులను కేంద్ర మంత్రి సంజయ్ మనుషులు ద్వంసం చేయడం దారుణమని అన్నారు. సంజయ్ కేటీఆర్‌పై బజారు భాషను వాడటమే కాకుండా కరీంనగర్ ఎమ్మెల్యే కార్యాలయంపై దాడి చేయించారని ఆరోపించారు. ప్రశాంతంగా ఉండే కరీంనగర్ రాజకీయాలను బండి సంజయ్ చెడ గొడుతున్నారని ఫైర్ అయ్యారు. విధ్వంసానికి పాల్పడ్డ గుండాలపై పీడీ యాక్ట్ ప్రయోగించి వారి నుంచే నష్టపరిహారం వసూలు చేయాలని.. బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో నగల దుకాణంలో తుపాకులతో బెదిరించి పట్టపగలే బంగారు ఆభరణాలు దోచుకెళ్లారని.. హైదరాబాద్‌లో డీసీపీ సుమతి పట్ల పోకిరీలు ప్రవర్తించిన తీరు శాంతిభద్రతలు దిగజారిన తీరును సూచిస్తున్నాయని పేర్కొన్నారు. వెంటనే డీజీపీ స్పందించాలని.. బండి సంజయ్‌కి చట్టాలపై ఏ మాత్రం నమ్మకం ఉన్నా తన గుండాలను పోలీసులకు అప్పగించాలని సూచించారు.

Next Story