Bus accident: 19 మంది సజీవదహనమైన బస్సులో బంగారం కోసం వేట

by Prasad Jukanti |   (  Updated:2025-10-30 10:15:32  IST  )

కర్నూల్ బస్సు ప్రమాదం జరిగిన చోట బంగారం కోసం కొంత మంది వెతుకులా వైరల్‍గా మారింది.

Bus accident: 19 మంది సజీవదహనమైన బస్సులో బంగారం కోసం వేట
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్నూల్ జిల్లాలో జరిగిన వేమూరి కావేరి బస్సు ప్రమాదంలో (Kurnool bus accident) 19 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. అంతులేని విషాదం నింపిన ఈ ఘటనలో ఒక్కో బాధితుడి గాథ అందరినీ కంటతటి పెట్టిస్తోంది. ఇదిలా ఉంటే పూర్తిగా దగ్ధమైన ఈ బస్సులో కొందరు వ్యక్తులు బంగారం కోసం వెతుకులాట వైరల్‍గా మారింది. ఈ నెల 24న ప్రమాదం జరిగిన ప్రమాదంలో ఈ బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రమాద సమయంలో బస్సు నుంచి బయటపడే మార్గం లేక 19 మంది బస్సులోనే కాలిపూడదైపోయారు. ఆ తర్వాత కాలిపోయిన బస్సును అధికారులు అక్కడే రోడ్డు పక్కకు జరిపి ఉంచారు. అయితే పూర్తిగా కాలిపోయిన వారి ఒంటిపై విలువైన ఆభరణాలు కాలి బస్సు శిథిలాల్లోనే ఉంటాయనే ఆశతో కొంత మంది ఆస్సు వద్ద వెతుకులాట మొదలు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.

Next Story