- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు బీజేపీ అడ్డంకి
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బీసీ బిల్లుకు బిజెపి పెద్ద అడ

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు బీజేపీ అడ్డంకి
సహకరించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు : ఎమ్మెల్యే కూనంనేని
దిశ, తెలంగాణ బ్యూరో : స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బీసీ బిల్లుకు బిజెపి పెద్ద అడ్డంకి మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఒక వైపు బిసి బిల్లుకు అడ్డుపడుతూ మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పంపిన బీసీ బిల్లులను గత నాలుగు నెలలుగా తొక్కి పెట్టడం సరికాదని, ఆర్డినెన్స్ ఆమోదం విషయంలో సైతం ఇదే విధంగా చేయడం సరికాదన్నారు. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లునే కాకుండా ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి ద్వంద వైఖరి అలంభిస్తోందని మండిపడ్డారు. ఆపరేషన్ సింధూర్ సంబంధించి అన్ని పార్టీలు, ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించగా, ఈ అంశంపై కేంద్రం మాత్రం పార్లమెంట్ ఒక్క సత్యం కూడా చెప్ప లేదన్నారు. యుద్దం తానే ఆపానంటూ అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కనీసం ఖండించే ధైర్యం కూడా ప్రధాని మోడీకి లేకుండా పోయిందన్నారు. వాస్తవాలను పార్లమెంట్ ముందు ప్రధాని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
పార్టీ ఫిరాయింపుల చట్టం సమగ్రంగా సవరించాలి :
ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ మూడు నెలలలోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు నిచ్చిందని, ఈ చట్టంలోని లోసుగులతో అది సాధ్యమా అని ప్రశ్నించారు. ఎవరు పార్టీ మారిన వారిపై తక్షణమే అనర్హత వేటు పడేలా చట్టాన్ని మరింత పటిష్టం చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారించిన జస్టిస్ పి.సి.ఘోష్ ఏకసభ్య కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసిందని బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బిజెపిలో బిఆర్ విలీనం విమర్శలపై బీఆర్ఎస్చీప్కేసీఆర్స్పష్టత ఇవ్వాలని డిమాండ్చేశారు.






