CPI: మా మద్దతుతోనే గెలిచారనే విషయం మర్చిపోవద్దు.. కాంగ్రెస్ పై కునంనేని హాట్ కామెంట్స్

by Prasad Jukanti |

మా మద్దతుతోనే గెలిచారనే విషయం మర్చిపోవద్దు.. కాంగ్రెస్ పై కునంనేని హాట్ కామెంట్స్

CPI: మా మద్దతుతోనే గెలిచారనే విషయం మర్చిపోవద్దు.. కాంగ్రెస్ పై కునంనేని హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కమ్యూనిస్టులను కలుపుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం అవుతున్నదని తెలంగాణ సీపీఐ (CPI) రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (kunamneni Sambasivarao) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చూస్తూ కూడా కమ్యూనిస్టులను విస్మరించడం సరికాదన్నారు. సీపీఐ మద్దతుతోనే కాంగ్రెస్ (Congress) గెలిచిందని మర్చిపోవద్దన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. చేసిన పనులు చెప్పుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందుతోందని రుణమాఫీ రూ.2 లక్షల విషయంలో కొంత వైఫల్యం చెందారన్నారు. ప్రభుత్వంలో ఎవరూ ఫోన్ కాల్స్ తీయడంలేదని ఆరోపించారు.

Next Story