కల్తీ కల్లు బాధితులను పరామర్శించిన కూక‌ట్‌ప‌ల్లి ఎమ్మెల్యే

by Ajay Maddhiboyina |

హైదరాబాద్‌లో కల్తీకల్లు 13 మంది ప్రాణాల మీదకు తెచ్చింది. శేర్లింగంపల్లికి చెందిన 13 మంది నిరుపేద కూలీలు కల్లుతాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

కల్తీ కల్లు బాధితులను పరామర్శించిన కూక‌ట్‌ప‌ల్లి ఎమ్మెల్యే
X

దిశ‌, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో కల్తీకల్లు 13 మంది ప్రాణాల మీదకు తెచ్చింది. శేర్లింగంపల్లికి చెందిన 13 మంది నిరుపేద కూలీలు కల్లుతాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని రాందేవ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా కూక‌ట్ ప‌ల్లి ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు ఆస్ప‌త్రికి వెళ్లి వారిని ప‌రామ‌ర్శించి త‌క్ష‌ణ వైద్య స‌హాయం అందించాల‌ని వైద్యుల‌కు సూచించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శేర్లింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ లీడ‌ర్ ఈ క‌ల్లు దుకాణం న‌డుపుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడితే ఊరుకునేది లేద‌ని మండిప‌డ్డారు. ఎట్టి ప‌రిస్థితుల్లో ఈ విష‌యాన్ని ఇక్క‌డితో వ‌దిలిపెట్టేది హెచ్చ‌రించారు.

Next Story