- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ ప్రభుత్వానికి కేటీఆర్ హెచ్చరిక
by Gantepaka Srikanth |
జనగామ నియోజకవర్గంలోని యశ్వంతాపూర్ గ్రామంలో 15 రోజులుగా పంట కొనుగోళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులను ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కలిసి, వారి సమస్యలను తెలుసుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: జనగామ నియోజకవర్గంలోని యశ్వంతాపూర్ గ్రామంలో 15 రోజులుగా పంట కొనుగోళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులను ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కలిసి, వారి సమస్యలను తెలుసుకున్నారు. పంట కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని రైతులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వాళ్లు కూడా స్పందించకపోవడం శోచనీయం అసహనం వ్యక్తం చేశారు. అక్కడి నుండే మార్క్‌ఫెడ్ ఎండీతో మాట్లాడి వెంటనే పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేసారు. ధాన్యం, శనగలు, మొక్కజొన్నలు, ఇతర అన్ని పంటలను వెంటనే కొనుగోలు చేయకుంటే, ఎక్కడికక్కడ రోడ్లెక్కి రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తామని రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎద్దేడ్చిన ఎవుసం... రైతేడ్చిన రాజ్యం బాగుపడవని కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు.
Next Story






