- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇక ఊరుకోం.. నాలుక చీరేస్తాం.. CM రేవంత్‌కు కేటీఆర్ హెచ్చరిక
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యాఖ్యలకు బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యాఖ్యలకు బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీని, మమ్మల్ని ఎన్ని తిట్టినా భరించాం, భరిస్తాం.. కానీ తెలంగాణ ప్రతిష్టను దెబ్బతినేలా మాట్లాడితే సహించేది లేదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు రాష్ట్ర భవిష్యత్‌కు శాపం పెట్టినట్లు ఉన్నాయని మండిపడ్డారు. ఢిల్లీ పార్టీలను నమ్మొద్దని ప్రజలకు కేసీఆర్ చిలుకకు చెప్పినట్లు చెప్పారు.. ఎన్నికలప్పుడు కేసీఆర్ చెప్పిన మాటలు నేడు అక్షరసత్యాలు అయ్యాయి.. పరిపాలన చేతగాక సీఎం రేవంత్ రెడ్డి కాడి కింద పడేశాడు.. రేవంత్ రెడ్డి అసమర్థ సీఎం అని నిన్నటి వ్యాఖ్యలతో తేలిపోయిందని కేటీఆర్ విమర్శించారు.
అధికారం కోసం అడ్డగోలుగా హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యోగుల త్యాగాలపై ఎన్నో మాట్లాడిన రేవంత్ ఇప్పుడెలా మాట్లాడుతున్నాడో చూడాలని ఉద్యోగ సంఘాలకు సూచించారు. ఉద్యమంలో కదం తొక్కిన ఉద్యోగులను సీఎం రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారని అన్నారు. ఉద్యోగులకు, ప్రజలకు మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే ఉద్యోగులు అడుగుతున్నారని అన్నారు. రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇచ్చేందుకు పైసలు లేవా? అని ప్రశ్నించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉండే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రం మళ్లీ పదేళ్లు వెనక్కి వెళ్లిందని అన్నారు. రాష్ట్రం దివాళా తీసిందని ఎవరన్నా బజారున పెట్టుకుంటారా? అని సీరియస్ అయ్యారు. రూ.170 కోట్ల లంచం ఇచ్చి.. ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టి పైసలు తెచ్చుకునే దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని సీరియస్ కామెంట్స్ చేశారు.
అధికారంలోకి వచ్చి 17 నెలలు గడుస్తున్నా ప్రజలకు పనికొచ్చే ఒక్క మంచి పని చేయలేదు అన్నారు. రాష్ట్రం దివాళా తీస్తే.. సీఎం సహా మంత్రుల ఆదాయాలు రోజురోజుకూ ఎలా పెరుగుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆదాయం ఎలా పెరుగుతోంది? అని అడిగారు. ఫార్మా కంపెనీ పేరుతో లగచర్ల భూములు గుంజుకుని రైతులను ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారని అన్నారు. కేసీఆర్ అప్పులు తెచ్చిండు.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిండు.. దేశంలోనే నెంబర్ స్టేట్‌గా నిలిపిండు అని గుర్తుచేశారు. పరిపాలన అంటే బజారు బాష మాట్లాడినంత ఈజీ కాదని హితవు పలికారు. ఇచ్చిన హామీలు అమలు చేసేటందుకు పైసల్లేవ్ కానీ.. అందాల పోటీలకు నిర్వహించేందుకు పైసలుంటాయా? అని అన్నారు. పరిపాలన చేతగాక పోతే రాజీనామా చేయి.. మళ్లీ రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా తాము చేసి చూపిస్తామని సవాల్ చేశారు. మరోసారి తెలంగాణ పరువు తీసేలా మాట్లాడినా.. కేసీఆర్‌ను వ్యక్తిగతంగా దూషించినా ఊరుకునే ప్రసక్తే లేదని.. నాలుక చీరేస్తామని కేటీఆర్ హెచ్చరించారు.






