- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KTR: ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన కేటీఆర్ విచారణ.. సిట్ ప్రశ్నల వర్షం!
తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విచారణ ముగిసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విచారణ ముగిసింది. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని ఏసీపీ కార్యాలయంలో సిట్ (SIT) అధికారులు ఆయనను సుమారు 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఉదయం 11 గంటల సమయంలో కేటీఆర్ విచారణ మొదలైంది. ఈ సందర్భంగా అధికారులు కేటీఆర్ నుంచి కీలక స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసినట్లు సమాచారం. ఇక, విచారణ ముగిసిన తర్వాత జూబ్లీహిల్స్ పీఎస్ నుంచి కేటీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.
ఫోన్ల ట్యాపింగ్ ఎందుకు జరిగింది?
2023 ఎన్నికలకు ముందు భారీ స్థాయిలో ఫోన్ల ట్యాపింగ్ ఎందుకు జరిగింది? అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్‌పై మీకు సమాచారం ఉందా? పార్టీ విరాళాలు, ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారాల్లో పోలీసు అధికారుల ప్రమేయం ఉందా? వంటి అంశాలపై సిట్ అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును విచారించిన సిట్, ఇప్పుడు కేటీఆర్‌ను విచారించడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.
కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్‌ఐబీ (SIB) కేంద్రంగా అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలపై 2024 మార్చిలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల సిట్ బృందం ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులను అరెస్ట్ చేయగా, ఇప్పుడు రాజకీయ నాయకుల విచారణ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.






