ఉద్యోగం సంపాదించిన కేటీఆర్ కొడుకు హిమాన్షు

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-08 13:57:13  IST  )

ఉద్యోగం సంపాదించిన కేటీఆర్ కొడుకు హిమాన్షు

ఉద్యోగం సంపాదించిన కేటీఆర్ కొడుకు హిమాన్షు
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండేవారికి బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ మ‌నువ‌డు క‌ల్వకుంట్ల హిమాన్షు(Kalvakuntla Himanshu) గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యక్రమాలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, తాత కేసీఆర్, తండ్రి కేటీఆర్‌ ఫొటోలు పోస్టులు చేయడం.. పలు కార్యక్రమాల్లో పాల్గొనటం వంటివి హిమాన్షు చేస్తుంటాడు. తాజాగా హిమాన్షుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళిన హిమాన్షు ఉద్యోగం చేస్తున్నట్లు రివీల్ చేశారు. అంతేకాదు.. తన మొదటి ఉద్యోగ అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇప్పటివరకు తరగతి గదిలో విద్యార్థిగా ఉండి.. ఇప్పుడు ఉపాధ్యాయుడిగా మారడం ఎంతో గొప్ప కొత్త అనుభూతిని ఇచ్చిందని హిమాన్షు చెప్పుకొచ్చారు.

Next Story