మరో ఎమ్మెల్యేను రెడీ చేసుకుందాం.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |

హైదరాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగరేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్(KTR) సూచించారు.

మరో ఎమ్మెల్యేను రెడీ చేసుకుందాం.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగరేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్(KTR) సూచించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లతో ఏమీ కాదని.. అది ఇప్పటికే తెలిసిపోయిందని విమర్శించారు. ప్రతీ రోజు ఇద్దరు మంత్రులు రోడ్డుమీదే గొడవలు పడుతున్నారు.. ఇంటి సమస్యలే తీర్చుకోలేని కాంగ్రెస్ నేతలు ప్రజల సమస్యలు ఏం పట్టించుకుంటారని ఎద్దేవా చేశారు. 11 ఎకరాలను కాపాడుకోవడానికి అరికపూడి గాంధీ పార్టీ మారారని అన్నారు. పైగా సిగ్గులేకుండా అభివృద్ధి కోసం పార్టీ మారాను అని చెబుతున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. అరికపూడి ఉన్నా.. పోయినా బీఆర్ఎస్‌కు ఒరిగేది ఏమీ లేదని.. అరికపూడి పోతే.. మరో ఎమ్మెల్యేను రెడీ చేసుకుందామని బీఆర్ఎస్ నేతలకు పిలుపునిచ్చారు. అన్ని దారులు తెలంగాణ భవన్ వైపే వస్తున్నాయి.. మళ్ళీ వ‌చ్చేది బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే అని గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న వారిని చూస్తుంటే అర్థ‌మ‌వుతోంది. కేసీఆర్ ఉన్న‌ప్పుడే బాగుండేదని అంద‌రూ చెబుతున్నారు. 500 రోజుల్లో మ‌ళ్లీ కేసీఆర్ ముఖ్య‌మంత్రిగా రాబోతున్నారని కేటీఆర్ జోస్యం చెప్పారు.

Next Story