ACB విచారణ వేళ కేటీఆర్ ట్వీట్.. రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

ఫార్ములా - ఈ కార్ రేస్ కేసు(Formula E Case)లో నేడు బీఆర్ఎస్(BRS) నేత కేటీఆర్ ఏసీబీ(ACB) విచారణకు హాజరు కాబోతున్నారు.

ACB విచారణ వేళ కేటీఆర్ ట్వీట్.. రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా - ఈ కార్ రేస్ కేసు(Formula E Case)లో నేడు బీఆర్ఎస్(BRS) నేత కేటీఆర్ ఏసీబీ(ACB) విచారణకు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ పెట్టారు. ‘రాజకీయ వేధింపులతో వెనక్కి తగ్గేది లేదు. ఆరు గ్యారంటీల మోసాన్ని ఎండగట్టడంలో ఇవేమీ ఆపలేవు. ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్‌ను ప్రజాక్షేత్రంలో నిలదీస్తూనే ఉంటాం.. ఎండగడుతూనే ఉంటాం.. 420 హామీలు, డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ చేసిన దగాను ప్రజలకు వివరిస్తాం’ అని ఎక్స్ వేదికగా కేటీఆర్ పేర్కొన్నారు. మరోవైపు ఏసీబీ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు. సోమవారం ఉదయమే నందినగర్‌లోని నివాసానికి వచ్చి చర్చించారు. కాగా, ఈ ఉదయం 10 గంటలకు విచారణ ప్రారంభం కానుంది.

Next Story