ఉగ్రరూపం దాల్చిన HYD మూసీ.. ఇది CM రేవంత్ కుట్ర అంటూ రెచ్చిపోయిన కేటీఆర్

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌లోని ఎంజీ బస్ స్టాండ్(MGBS) వద్ద మూసీనది ఉధృతంగా ప్రవహిస్తోన్న విషయం తెలిసిందే.

ఉగ్రరూపం దాల్చిన HYD మూసీ.. ఇది CM రేవంత్ కుట్ర అంటూ రెచ్చిపోయిన కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఎంజీ బస్ స్టాండ్(MGBS) వద్ద మూసీనది ఉధృతంగా ప్రవహిస్తోన్న విషయం తెలిసిందే. మూసీలో నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో ఎంజీబీఎస్ ప్రాంగ‌ణంలోకి భారీగా వ‌ర‌ద చేరింది. బస్టాండ్‌ పరిసర ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. తాజాగా ఈ పరిస్థితిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పందించారు. శనివారం తెలంగాణ భవన్ వేదికగా కేటీఆర్ మాట్లాడారు. పథకం ప్రకారమే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఎంజీ బస్ స్టాండ్‌ను ముంచారని హాట్ కామెంట్స్ చేశారు. మూసీ ప్రాజెక్టు కోసం కిరాతకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వరద హెచ్చరికలు ఉన్నా.. ఉద్దేశపూర్వకంగానే జంట జలాశయాల నుంచి నీరు వద్దల్లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేందుకే ఒకేసారి 15 గేట్లు ఎత్తారని అన్నారు. గతంలో ఎన్నడూ లేనిది ఇప్పుడే ఎంజీబీఎస్ ఎందుకు మునిగింది అని ప్రశ్నించారు. పేదల ఇళ్లు ముంచాలనే కుట్రతోనే ఇదంతా చేశారని అన్నారు. మూసీ ప్రాజెక్టు వద్దన్నందుకే ఈ కుట్రకు తెరలేపారని హాట్ కామెంట్స్ చేశారు. మరోవైపు ముసారాంబాగ్‌, చాదర్‌ఘాట్‌ వంతెనలపై నుంచి మూసీ ఉప్పొంగి ప్రవహిస్తోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

Next Story