‘రాజీవ్ గాంధీ’ అని పేరు మార్చుకో.. CM రేవంత్‌కు కేటీఆర్ సూచన

by Gantepaka Srikanth |

తెలంగాణలో రూ.5 భోజనం ‘అన్నపూర్ణ’ పథకం పేరు మార్చడంపై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పందించారు.

‘రాజీవ్ గాంధీ’ అని పేరు మార్చుకో.. CM రేవంత్‌కు కేటీఆర్ సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రూ.5 భోజనం ‘అన్నపూర్ణ’ పథకం పేరు మార్చడంపై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పందించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చడం హాస్యాస్పదం, సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఢిల్లీ బాసుల ముందు మార్కులు కొట్టేయడానికి ఇంతలా దిగజారాలా? అని ప్రశ్నించారు. అంత అవసరం ఉంటే మీ పేరు మార్చుకోవవచ్చు కదా? అని సీరియస్ అయ్యారు. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తన పేరు మార్చుకొని.. రాజీవ్ గాంధీ లేదా? జవహర్ లాల్ నెహ్రూ అని మార్చుకుంటే బావుంటుందని కదా అని సూచించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అర్ధరహిత చర్యలన్నింటినీ రద్దు చేస్తామని కీలక ప్రకటన చేశారు. కాగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) స్టాండింగ్ కమిటీలో అన్నపూర్ణ అనే పేరు మార్చి 'ఇందిరా క్యాంటీన్'గా ఖరారు చేశారు. ఈ పేరు మార్పు కేవలం నామమాత్రమే కాదు, పథకం స్వరూపాన్ని, అందించే సేవలను కూడా విస్తృతం చేయాలనే అని ప్రభుత్వ పెద్దలు చెప్పారు.

Next Story