- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ అప్పులపై KTR సంచలన వ్యాఖ్యలు.. KCR పాలనలో ఎంత చేశారో తెలుసా?
కాళేశ్వరం(Kaleswaram), మేడిగడ్డ ప్రాజెక్ట్(Medigadda Project)లపై వచ్చిన రిపోర్ట్ ఎన్‌డీఎస్‌ఏ(National Dam Safety Authority)ది కాదని.. ఎన్డీఏ ప్రభుత్వ రిపోర్ట్ అని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం(Kaleswaram), మేడిగడ్డ ప్రాజెక్ట్(Medigadda Project)లపై వచ్చిన రిపోర్ట్ ఎన్‌డీఎస్‌ఏ(National Dam Safety Authority)ది కాదని.. ఎన్డీఏ ప్రభుత్వ రిపోర్ట్ అని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. శుక్రవారం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో కేటీఆర్ మాట్లాడారు. ఎన్‌డీఎస్‌ఏ(NDSA) నిపుణుల కమిటీ ఇప్పటివరకు ఆ ప్రాజెక్టునే చూడలేదు అని అన్నారు. ఎన్‌డీఎస్‌ఏను కేంద్రం పంపిన దూతగా మాత్రమే చూస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్‌డీఎస్‌ఏ(NDSA) వారు కనీసం విచారణ కూడా జరుపలేదని విమర్శించారు. బిహార్‌లో బ్రిడ్జీలు కూలుతుంటే ఎన్డీఎస్‌ఏ ఏం చేస్తో్ందని ప్రశ్నించారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి 10 శాతం అయితే.. పదేళ్లలోనే తాము తెలంగాణను దేశంలోనే నెంబర్ స్టేట్‌గా నిలిపామని అన్నారు. అయినా కేసీఆర్(KCR)ను విమర్శిస్తున్నారని ఆవేదన చెందారు. తెలంగాణకు విఘాతం, అన్యాయం కలిగితే మొదట స్పందించే వ్యక్తి కేటీఆర్ అని చెప్పారు. అవసరమైతే తెలంగాణ కోసం కేసీఆర్ గర్జించేవారు అని గుర్తుచేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతుందని.. ఈ 17 నెలల్లో ఏం చేశారని ప్రజలు అడిగితే చెప్పే పరిస్థితి లేదని విమర్శించారు. ఒక్క ప్రాజెక్ట్ కట్టకపోగా.. ప్రాజెక్టుల నుంచి నీళ్లు వదలకుండా రైతులను వేధిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు ఎప్పుడూ ప్రమాదమే అన్నారు. ఒకటి ఢిల్లీకి సంచులు మోసే పార్టీ.. ఇంకోటి ఢిల్లీ పెద్దల చెప్పులు మోసే పార్టీ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రేవంత్ - రాహుల్ ట్యాక్స్ వసూలు అవుతోందని ఆరోపించారు. ప్రతీ నెలా ఢిల్లీకి సంచులు పోతున్నాయని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఏడాదికి రూ.40 వేల కోట్ల అప్పులు చేస్తే.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏడాదిలోనే రూ.1.60 లక్షల కోట్ల అప్పులు చేశారని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని.. కేసీఆర్ కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. వరంగల్ సభతో అందరికీ క్లారిటీ వస్తుందని తెలిపారు.






