‘కన్నవారిని కన్నీళ్లు పెట్టించకు’: కవిత కొత్త పార్టీపై కేటీఆర్ తొలి స్పందన

by Gantepaka Srikanth |

గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన కల్వకుంట్ల కవిత 'కొత్త పార్టీ' అంశంపై ఆమె సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలిసారిగా స్పందించారు.

‘కన్నవారిని కన్నీళ్లు పెట్టించకు’: కవిత కొత్త పార్టీపై కేటీఆర్ తొలి స్పందన
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన కల్వకుంట్ల కవిత 'కొత్త పార్టీ' అంశంపై ఆమె సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలిసారిగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయంగానే కాకుండా, కుటుంబపరంగానూ తీవ్ర సంచలనం రేపుతున్నాయి. కవిత వ్యవహారశైలిపై కేటీఆర్ ఘాటుగా స్పందిస్తూ హితవు పలికారు. "కన్నవారిని కవిత ఏడిపించకూడదని నా సూచన. తల్లిదండ్రులకు మనం మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ, వారు బాధపడే పనులు మాత్రం అస్సలు చేయకూడదు. కవిత ప్రవర్తన వల్ల తరచూ కుటుంబ సభ్యులు మనస్తాపానికి గురవుతున్నారు. ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదు." అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కవిత చాలా తెలివైన మహిళ, ఆమెకు రాజకీయాలపై మంచి అవగాహన ఉంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె ఇలా ప్రవర్తించడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇకనైనా తన వైఖరిని మార్చుకోవాలని కోరుకుంటున్నాను." అని ఆయన పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో వైరల్..

కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో, సొంత సోదరుడే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. కుటుంబంలో అంతర్గతంగా విభేదాలు ఉన్నాయా? అందుకే కవిత కొత్త దారి వెతుక్కుంటున్నారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి.

Next Story