‘ఇప్పటికైనా మించిపోయిందేం లేదు’.. CM రేవంత్‌కు కేటీఆర్ సూచన

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు చేశారు.

‘ఇప్పటికైనా మించిపోయిందేం లేదు’.. CM రేవంత్‌కు కేటీఆర్ సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా కేటీఆర్ పోస్టు పెట్టారు. అందాల పోటీల్లో ముఖ్యమంత్రి మునిగితేలుతుంటే.. మరోవైపు వడదెబ్బకు తాళలేక ధాన్యం కుప్పలపైనే ఓ అన్నదాత బలికావడం అత్యంత బాధాకరమని అన్నారు. రేవంత్ చేతకానితనం వల్ల సీఎం సొంత జిల్లా పాలమూరులోని పెద్ద వంగర మండలం పోచంపల్లి గ్రామంలో గుగులోతు కిషన్ (51) అనే రైతు నిండుప్రాణం గాలిలో కలిసిపోయిందని తెలిపారు. ఇది ముమ్మాటికీ ముఖ్యమంత్రి చేసిన హత్యే అని కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడి సాయం ఎగ్గొట్టినా, రుణమాఫీ పేరిట మోసం చేసినా ఆరుగాలం కష్టించి పండించిన పంటను చివరికి కొనే దిక్కు కూడా లేకపోవడంతో.. తెలంగాణ రైతన్న అనాథలా మారాడని అని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. ఓవైపు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం అకాల వర్షాలతో కండ్లముందే కొట్టుకుపోతున్న దుస్థితి.. మరోవైపు మండుతున్న ఎండలను తట్టుకోలేక రైతుల గుండెలు పగులుతున్న దయనీయ పరిస్థితి నెలకొందని అన్నారు. వీటికి పూర్తి బాధ్యత ఈ దద్దమ్మ కాంగ్రెస్ సర్కారుదేనని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో వారాల తరబడి పడిగాపులు పడుతున్నా పట్టించుకునే వాడు లేకపోవడంతో అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. వడదెబ్బకు, సర్కారు నిర్వాకానికి బలైన అన్నదాత కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రికి సోయి ఉంటే.. కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతుల కష్టాలు తీర్చాలి. లేకపోతే కట్టలు తెంచుకునే అన్నదాతల ఆగ్రహానికి ఈ కాంగ్రెస్ సర్కారు కొట్టుకుపోతుందని అన్నారు.

Next Story