- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కంచె గచ్చిబౌలి భూముల వెనుక సీఎం రమేష్ : కేటీఆర్ సంచలన ఆరోపణలు
కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం(Kanche Gachibowli land issue)పై బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్(KTR) సంచలన ఆరోపణలు చేసారు.

దిశ, వెబ్ డెస్క్ : కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం(Kanche Gachibowli land issue)పై బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్(KTR) సంచలన ఆరోపణలు చేసారు. కంచె గచ్చిబౌలి భూముల తనఖా వెనుక బీజేపీ ఎంపీ సీఎం రమేష్(BJP MP CM Ramesh) ఉన్నారని తీవ్ర ఆరోపణలు చేసారు. భూములు తనఖాకు సహాయం చేసినందుకు సీఎం రమేష్ కు ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి రూ.1600 కోట్ల రోడ్ల కాంట్రాక్టులు కట్టబెట్టారని అన్నారు. ఇది ముమ్మాటికీ బీజేపీ, కాంగ్రెస్ మధ్య అక్రమ సంబంధం అన్నారు. కేంద్ర సాధికారత కమిటీ రిపోర్టుపై ఇప్పటి వరకు బిజెపి ఎందుకు చర్యలు తీసుకోలేదో, ఎందుకు మౌనంగా ఉందొ తెలపాలని కేటీఆర్ డిమాండ్ చేసారు. ఈ వ్యవహారంపై రాహుల్ గాంధీ ఎందుకు కళ్లు మూసుకున్నారో అర్థం కావడం లేదని మండిపడ్డారు.
సీఎం రేవంత్ ను చుస్తే జాలిగా ఉందని, సోనియా లేఖలో ఏముందో తెలియకుండానే ఆస్కార్ అవార్డు అంటూ మురిసిపోతున్నారని ఎద్దేవా చేసారు. అందులో సమావేశానికి రాలేకపోతున్నాని మాత్రమే ఉందని, ఒక్క ప్రశంస కూడా లేదని, లెటర్ చదివే తెలివి కూడా లేదని, లేఖలో ఏముందో తెలియకుండానే అంత బిల్డప్ ఇస్తున్నారని వ్యంగ్య వ్యాఖ్యలు చేసారు.






